Rajiga ori Rajiga Song- Guda Anjaiah

0 Comments

రాజిగ ఒరి రాజిగ.. రాజిగ ఓరి రాజిగ
ఓరి అయిలపురం రాజిగ ఓరి ఓరుగల్లు రాజిగ
పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ
ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ ఒరి రాజిగ

గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
సేను వాయె సెలక వాయె గజ్జలో రాజన్న
బతుకు వాయె మెతుకు వాయె గజ్జలో రాజన్న
మోతుకు మూడాకులాయె గజ్జలో రాజన్న
గోడ్డు వాయె గోద వాయె గజ్జలో రాజన్న
వలసవోయి బతుకుడాయె గజ్జలో రాజన్న
ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగ ఓరి రాజిగ
మన తెలంగాణ ఆగమాయె రాజిగ ఒరి రాజిగ

గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
యాసవాయె భాష వాయె గజ్జలో రాజన్న
పండుగ-పబ్బాలు వాయె గజ్జలో రాజన్న
సింగరేణి సిరులువాయె గజ్జలో రాజన్న
రామగుండ మెలుగువాయె గజ్జలో రాజన్న
సదువుకున్న కొలువులేదు గజ్జలో రాజన్న
ప్రమోషన్ల పేరులేదు గజ్జలో రాజన్న
అరె నీళ్లు దోసి నిధులు దోసి రాజిగ ఓరి రాజిగ
వాడు నిండ ముంచి ముండ మోపె రాజిగ ఒరి రాజిగ

రాజిగ ఒరి రాజిగ..రాజిగ ఓరి రాజిగ
ఓరి అయిలపురం రాజిగ.. ఓరి ఓరుగల్లు రాజిగ
పుడితొక్కటి సత్తెరెండు.. రాజిగ ఓరి రాజిగ
ఎత్తుర తెలగాణ జెండ.. రాజిగ ఒరి రాజిగ

గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
సచ్చినోని లగ్గానికి గజ్జలో రాజన్న
వచ్చిందె కట్నమాయె గజ్జలో రాజన్న
శివారు భూములల్లో గజ్జలో రాజన్న
రియల్ ఎస్టేట్ వ్యాపారం గజ్జలో రాజన్న
కాకులను కొడుతుండ్రు గజ్జలో రాజన్న
గద్దలకు పంచుతుండ్రు గజ్జలో రాజన్న
అందరు శాఖాహారులె రాజిగ ఓరి రాజిగ
మరి రొయ్యల ముల్లె యాడవాయె రాజిగ ఒరి రాజిగ

రాజిగ ఒరి రాజిగ రాజిగ ఓరి రాజిగ
ఓరి ఐలపురం రాజిగ ఓరి తెలంగాణ రాజిగ
పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ
ఎత్తుర తెలగాణ జెండ రాజిగ ఒరి రాజిగ

గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
ఉభయ కమ్యూనిస్టులది గజ్జలో రాజన్న
గోడమీది వాటమాయె గజ్జలో రాజన్న
తెలుగుదేశపోళ్ల చూడు గజ్జలో రాజన్న
తోక దెగిన కోతులైరి గజ్జలో రాజన్న
భారతీయ జనత పార్టి గజ్జలో రాజన్న
పాసువండ్ల దాసరాయె గజ్జలో రాజన్న
దొంగ కాంగిరేసు సూడు రాజిగ ఒరి రాజిగ
వాడు నేడు హీరో రేపు జీరో రాజిగ ఒరి రాజిగ

రాజిగ ఒరి రాజిగ..రాజిగ ఓరి రాజిగ
ఓరి అయిలపురం రాజిగ.. ఓరి ఓరుగల్లు రాజిగ
పుడితొక్కటి సత్తెరెండు.. రాజిగ ఓరి రాజిగ
ఎత్తుర తెలగాణ జెండ.. రాజిగ ఒరి రాజిగ

గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
సుక్క పొద్దు వొడిసిరాంగ గజ్జలో రాజన్న
సూర్యుడు ఎదురుంగ రాంగ గజ్జలో రాజన్న
కట్టు కట్టు నడుం కట్టు గజ్జలో రాజన్న
కాశె వోసి గోసి వెట్టు గజ్జలో రాజన్న
పట్టు పట్టు ఉడుం పట్టు గజ్జలో రాజన్న
పల్లె పల్లె లొల్లివెట్టు రాజిగ ఒరి రాజిగ
తెలంగాణ రాకపోతే ఒట్టు రాజిగ ఒరి రాజిగ

రాజిగ ఒరి రాజిగ..రాజిగ ఒరి రాజిగ
ఓరి అయిలపురం రాజిగ.. ఓరి ఓరుగల్లు రాజిగ
పుడితొక్కటి సత్తెరెండు.. రాజిగ ఓరి రాజిగ
ఎత్తుర తెలగాణ జెండ.. రాజిగ ఒరి రాజిగ


You may also like